MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రకళ ప్రకటనలో కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17వ తేదీ డెమో క్లాస్ నిర్వహించబడుతుందని తెలిపారు.