TG: మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష ముగిసింది. అయితే, పరీక్ష కేంద్రంలోకి ఓ అభ్యర్థి ఫోన్ తీసుకెళ్లాడు. ఎగ్జామ్ రాస్తుండగా చూసిన ఇన్విజిలేటర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రలోకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.