బయోకాన్ గ్రూప్ ఛైర్పర్సన్ కిరణ్ మజందార్ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్జీ టాటా పురస్కారం వరించింది. భారత్లో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐఎస్క్యూ వెల్లడించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్క్యూ వార్షిక కాన్ఫరెన్స్-2024లో ఆమెకు ఈ పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. ఈ అవార్డును తనకు ప్రకటించడం పట్ల కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు.