MBNR: గ్రూప్-2 పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని JPNCE కళాశాల పరీక్షా కేంద్రం వద్ద జోన్- 7 డీఐజీ ఎల్.ఏస్.చౌహన్, ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను నేడు పరిశీలించారు. సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.