MDK: గ్రూప్-2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 5,885 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ కిట్, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు.