SKLM: రాజాం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారని ఐటీఐ ప్రిన్సిపల్ బండారు భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువతీ యువకులకు అవకాశం ఉంటుందన్నారు.