ASR: రాజవొమ్మంగి స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం రిటైల్ శిక్షణకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు సీడ్ ఏపీ ట్రైనర్ కె.రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.