BDK: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రోఫైనాన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు ఎంపీడీవో కార్యాలయంలో ఉ. 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన వారిని అర్హులుగా ప్రకటించారు.