SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోవిందమ్మ తెలిపారు. ఈ మేరకు ఇంటర్, ITI , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 19 నుంచి 30 ఏళ్ల వయసు గల యువకులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.