• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

11 నెలల్లో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు

గత 11 నెలల వ్యవధిలో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. వీటి విలువ రూ.223 లక్షల కోట్లు అని పేర్కొంది. భారత్‌కు చెందిన ఈ డిజిటల్ సేవలు ఇతర దేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఈ యూపీఐ సేవలు యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.23.49 కోట్ల విలువైన లావాదేవీలు జరగటం ...

December 15, 2024 / 06:21 AM IST

గ్రూప్-2 పరీక్షకు 16 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

MDK: గ్రూప్-2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 5,885 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ కిట్, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు.

December 15, 2024 / 05:23 AM IST

గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

JGL: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గనులు, భూగర్భ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్ జైసింగ్ అన్నారు. గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు సందర్భంగా శనివారం స్థంభంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో సౌకర్యాలు పరిశీలించారు.

December 15, 2024 / 04:07 AM IST

గిరిజన యూనివర్సిటీలో ముగిసిన వర్క్షాప్

VZM: డిల్లీ ఐఐటీ సహకారంతో గిరిజన యూనివర్సిటీలో డిసెంబర్ 12,13 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగిన వర్క్ షాప్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ కట్టమణి మాట్లాడుతూ.. పరిశోధకులు ప్రదర్శనల ద్వారా తమ పరిశోధనలను విస్తృతంగా ప్రసారం చేయవచ్చుని తెలిపారు. సమీప కళాశాలలు, ఏయూ విశాఖ, ANU గుంటూరు శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీల నుంచి విద్యార్ధులు పాల్గొన్నారు.

December 14, 2024 / 08:36 AM IST

ఈనెల 17న ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

SKLM: రాజాం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారని ఐటీఐ ప్రిన్సిపల్ బండారు భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువతీ యువకులకు అవకాశం ఉంటుందన్నారు.

December 14, 2024 / 08:17 AM IST

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

TG: రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది. ‘పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా గేట్లు క్లోజ్ చేస్తాం. హాల్ టికెట్, ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు తీసుకురావాలి. పెళ్లైన మహిళలు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చు. షూ వేసుకుని రాకూడదు. చెప్పులు మాత్రమే ధరించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి’ అని ...

December 14, 2024 / 08:15 AM IST

నేడు ఇంటర్వ్యూలు

ASR: రాజవొమ్మంగి స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం రిటైల్ శిక్షణకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు సీడ్ ఏపీ ట్రైనర్ కె.రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

December 14, 2024 / 08:01 AM IST

రేపు అన్ని పాఠశాలలకు సెలవు

SKLM: జిల్లాలో రేపు రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించడమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య తెలిపారు. దీనిని ముందుగా పని దినంగా ప్రకటించినప్పటికీ, జల సంఘాల ఎన్నికల దృష్ట్యా రద్దు చేశామన్నారు. ఫిబ్రవరి 2వ శనివారం పని దినంగా ఉంటుందన్నారు.

December 14, 2024 / 07:59 AM IST

గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్నఈ పరీక్షలకు 11, 309 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 28 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

December 14, 2024 / 07:40 AM IST

బీసీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ప్రారంభం

VZM: పార్వతీపురంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీలకు, ఎస్సీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభమైంది. పార్వతీపురం భాస్కర కళాశాలలో శుక్రవారం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎండి. గయాజుద్దీన్ ఉచిత కోచింగ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.

December 14, 2024 / 07:32 AM IST

17న ఆత్మకూరులో జాబ్ మేళా

NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 17న ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు.

December 14, 2024 / 07:14 AM IST

‘విద్యార్థినులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి’

NZB: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకుంటారని ప్రముఖ వైద్యులు భూంరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ జెమ్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని మాణిక్‌భవన్‌, గుండారం హైస్కూల్‌, శంకర్‌భవన్‌, ఆర్చిడ్‌, సెయింట్ జెవియర్స్‌ స్కూల్‌ విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షడు పద్మ ...

December 14, 2024 / 05:58 AM IST

BOB క్రెడిట్ కార్డు.. మహిళలకు మాత్రమే!

BOB అనుబంధ బీఓబీ కార్డ్ లిమిటెడ్ మహిళల కోసం కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. తియారా పేరిట లాంఛ్ చేసిన ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, లైఫ్‌స్టైల్‌కి సంబంధించి పలు ప్రయోజనాలు అందించనుంది. ఈ కార్డు కోసం జాయినింగ్ ఫీజు రూ.2,499+ GST చెల్లించాలి. కార్డు తీసుకున్న 60 రోజుల్లో రూ.25 వేల వరకు లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజుని తిరిగిస్తారు. ఏడాదిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్ష...

December 13, 2024 / 05:52 PM IST

రైల్వే అభ్యర్థులకు ALERT

జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు గత జూలైలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను RRB తాజాగా విడుదల చేసింది. https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

December 13, 2024 / 04:01 PM IST

ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాలు

MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చంద్రకళ కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17V డెమో క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

December 13, 2024 / 10:31 AM IST