దేశంలో కొత్తగా 85 కేంద్రీయ, 28 నవోదయ విద్యాలయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట. ఏపీలో చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
GNTR: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో స్పాట్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామచంద్రరావు తెలిపారు. ఈనెల 9న ఉదయం 9.30 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.
NRML: ముధోల్ గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో భౌతిక శాస్త్రం 01, గణిత శాస్త్రం 01 ఖాళీగా ఉన్నాయని అర్హులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 7 నుంచి 9 వరకు ఉట్నూరులోని ఆర్సీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కృష్ణా: ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 81709 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24677 దగ్గర ముగిసింది.
RBI చిన్న, సన్నకారు రైతులకు ఊరట కల్పించింది. రైతులకు తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు చూపించకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనిపై త్వరలోనే RBI సర్క్యులర్ జారీ చేయనుంది. ఈ రుణాలపై పరిమితిని చివరిసారిగా 2019లో రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు.
వచ్చే వారం రెండు కంపెనీలు IPOకు రానున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్, విశాల్ మెగామార్ట్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ డిసెంబరు 11న ప్రారంభమై.. 13న ముగియనున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.522-549గా నిర్ణయించగా.. 16న షేర్ల అలాట్‌మెంట్, 18న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న విశాల్ మెగామార్ట్ కంపెనీ ధరల శ్రేణి రూ.7...
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 7న నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
KNL: బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈనెళల 12న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 30 రకాల బహుళ జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటుండగా.. 1,000కి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కృష్ణా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య, సాక్ష్యం, శక్తి పథకాల అమలుకై కాంట్రాక్ట్ పద్ధతిన 14 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 42 సంవత్సరాలలోపు వయసున్న అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ నెల 7లోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరల స్థిరీకరణ కీలకమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆయన.. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. కాగా.. వరుసగా 11వ సారి ఎలాంటి మార్పు చేయకపోవటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో 65% పెరిగినట్లు చెప్పింది. జైపూర్, ఆగ్రా, గుంటూరు, మంగళూరు, చంఢీగఢ్‌లో భారీగా పెరుగుదల నమోదైందని పేర్కొంది. స్థలం రేటు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటం ఇందుకు కారణమని వ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 81,840 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 24,720 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 84.66 వద్ద ఉంది.
గత పదేళ్లలో బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ లోని యూబీఎస్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. బిలియనీర్ల సంఖ్య కూడా పదేళ్లలో 1757 నుంచి 2,682కు చేరిందని బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది 268 మంది కొత్తగా బిలియనీర్లు అవ్వగా.. వీరిలో 60 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్లేనని నివేదిక పేర్కొంది.
NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారి ఆస్తా మహిన్ (8) మృతికి కారకులైన పాఠశాల హెచ్ఎం సబిహ, ఎంఈఓ నబిసాలను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పీడీఎస్‌యు, ఎస్ఎఫ్ఎ, డిమాండ్ చేశారు.