• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు.

December 11, 2024 / 04:48 PM IST

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,568.39 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. చివరికి 16 పాయింట్ల లాభంలో 81,526.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్లు లాభంలో 24,641.80 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.84గా ఉంది.

December 11, 2024 / 04:12 PM IST

ఒకేరోజు 5 IPOల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

ఈ రోజు ఐదు కంపెనీల IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ప్రధాన విభాగంలో విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్.. SME విభాగంలో పర్పుల్ యునైటెడ్ సేల్స్, సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ మొదలైంది. వీటిలో మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూ తొలిగంటలోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కాగా, 13న ఈ కంపెనీల IPO సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది.

December 11, 2024 / 02:48 PM IST

ఈ నెల 13న జిల్లా కేంద్రంలో జాబ్ మేళా

NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 13 వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ పార్మసీ, బి.ఫార్మసీ, ఆ పైన చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.

December 11, 2024 / 02:27 PM IST

ప్రకాశం జిల్లాలో అంగన్వాడీ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఖాళీల భర్తీ చేసేందుకు బుధవారం ప్రాజెక్టు డైరెక్టర్ శారద నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 15 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 89 ఆయాల పోస్టులు భర్తీచేయనున్నారు. ఈ నెల 11 నుండి 23లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 11, 2024 / 12:34 PM IST

మరోసారి పెరిగిన పసిడి ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరగటంతో రూ.79,470కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.72,850గా ఉంది. మరోవైపు వెండి ధర దిగొచ్చింది. దీంతో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,03,000 ఉంది.

December 11, 2024 / 10:42 AM IST

మెడికల్ కళాశాలలో పోస్టులు రద్దు

KRNL: గతంలో జారీ చేసిన 2 నోటిఫికేషన్లలో ఆదోని మెడికల్ కళాశాల, ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పోస్టుల భర్తీని రద్దు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ K.చిట్టి నరసమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన పోస్టుల వివరాలు, ప్రస్తుతం భర్తీ చేస్తున్న వివరాలు కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్లలో https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in ఉంచమన్నారు.

December 11, 2024 / 10:03 AM IST

ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 81,515 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 24,627 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.87గా ఉంది.

December 11, 2024 / 09:55 AM IST

కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఎక్కువ!

వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పలు సంస్థల్లో నియామకాలు పెరగనున్నట్లు మానవ వనరుల సేవల సంస్థ నివేదిక వెల్లడించింది. ఉద్యోగుల నియామకంపై కంపెనీలు సానుకూలంగా ఉన్నాయని.. అయితే ఈ కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఎక్కువ ఉండనున్నట్లు చెప్పింది. దాదాపు 53% సంస్థలు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్లు తెలిపింది. దేశంలోని 3వేలకు పైగా వ్యాపార సంస్థల సమాచారం సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది.

December 11, 2024 / 09:29 AM IST

నేటి నుంచి ఎస్ఏ-1 పరీక్షలు

TPT: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో అర్థ వార్షిక పరీక్షలు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ (ఎస్ఏటీఎంపీ) టర్మ్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

December 11, 2024 / 07:06 AM IST

13న ఎడ్‌సెట్ స్పాట్ అడ్మిషన్లు

TPT: ఈ నెల 13వ తేదీన ఎడ్‌సెట్ -2024 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎస్వీయూలోని అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్టు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు, ఎడ్‌సెట్ ర్యాంకు కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చని వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు కోరారు.

December 11, 2024 / 07:05 AM IST

పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా: యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి 2025 జనవరి 10 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది.

December 11, 2024 / 06:48 AM IST

RBI గవర్నర్‌గా నేడు సంజయ్ బాధ్యతల స్వీకరణ

ఆర్బీఐ 26వ గవర్నర్‌గా ఇవాళ సంజయ్ మల్హోత్రా బాధ్యతలను స్వీకరించనున్నారు. సంజయ్ మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. తన 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెవెన్యూ, ఆర్థిక, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేశారు. సంజయ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ IAS అధికారి. ఐఐటీ కాన్పూర్‌ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.

December 11, 2024 / 06:15 AM IST

2025లో ఐపీఓకి రానున్న జెప్టో

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓకి రానుంది. ఈ విషయాన్ని సంస్థ కో- ఫౌండర్ ఆదిత్ పాలిచా తెలిపారు. 2025లో ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్‌లోకి రావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 నాటికి అప్పులన్నీ తీరిపోయి సంస్థ లాభాల్లోకి అడుగుపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని.. రోజుకు వేల వస్తువులను 10 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్...

December 11, 2024 / 04:50 AM IST

జిల్లా స్థాయి పరీక్షలో సత్తా చాటిన గుండెమడకల విద్యార్థులు

NLR: స్క్రీనింగ్ పరీక్షల్లో గుండెమడకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో సత్తా చాటారు. కౌశల్ -2024 ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి స్క్రీనింగ్ పరీక్షలో 10వ తరగతి చదువుతున్న సాయి తేజ, షణ్ముఖ ప్రియ విద్యార్థులు సత్తా చాటారని HM తెలిపారు. డిసెంబర్ 30న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పాల్గొంటారన్నారు.

December 11, 2024 / 04:16 AM IST