SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.