• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

GOOD NEWS: తగ్గిన పసిడి ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ పసిడి ధరలు బాగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గటంతో రూ.77,130గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,700కు చేరింది. కాగా.. కిలో వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గటంతో రూ.99,000 ఉంది.

December 19, 2024 / 11:00 AM IST

హెల్త్ సూపర్వైజర్ పోస్టుకు రేపు ఇంటర్వ్యూలు

NLG: నల్గొండలోని డాన్ బోస్కో పాఠశాలలో కొనసాగుతున్న చండూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. BSC నర్సింగ్, GNM, MPH, అర్హత గలవారు అర్హులని తెలిపారు. వేతనం రూ.14 వేలు చెల్లిస్తారన్నారు. ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

December 19, 2024 / 10:46 AM IST

సైన్స్ ఎగ్జిబిషన్ వాయిదా: డీఈఓ

NLG: ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ బి.బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మంత్రి కోమటిరెడ్డితో ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం లేనందున సైన్స్ ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని డీఈఓ తెలిపారు.

December 19, 2024 / 10:21 AM IST

డిగ్రీ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల

ADB: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 20, 21 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్సీ, బీకామ్ కంప్యూటర్స్ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

December 19, 2024 / 09:54 AM IST

ఇరాన్ కరెన్సీ భారీగా పతనం

ఇరాన్ కరెన్సీ ‘ఇరానియన్ రియాల్’ విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోలిస్తే మరకపు విలువ నవంబర్‌లోనే 10 పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఒక డాలురు మారకపు విలువ 7,77,000 రియాల్స్. ఇబ్రహీం రైసీ మరణం, ఈ ఏడాదిలో ఆ దేశ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యలు స్వీకరించటం, ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం.. ఇరాన్ కరెన్సీ పడిపోవటానికి కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

December 19, 2024 / 07:45 AM IST

PG వన్ టైం ఛాన్స్ పరీక్షలు!

MDK: ఉమ్మడి మెదక్ విద్యార్థులకు అలర్ట్. OU పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షల టెంటేటీవ్ (తాత్కాలిక) తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. M.SC, MA, M.COM, MSW, BLIBSC, BCJ, M.LIBISC, MJ&MC, M.COM(IS) అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 17 నుంచి నిర్వహించనున్నామని చెప్పారు.

December 19, 2024 / 07:23 AM IST

కర్నూలు జిల్లాలో 16 మంది డిబార్

కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్ఛార్జి వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.

December 19, 2024 / 07:04 AM IST

100% ఉత్తీర్ణత శాతం సాధించడమే లక్ష్యం: డీఈవో

KRNL: టెన్త్ పరీక్షల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరిగిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అందుకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు ఈ విద్యా సంవత్సరం సాధించనున్నారని తెలిపారు.

December 19, 2024 / 06:13 AM IST

ఈ నెల 28 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు

MBNR: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ 2 వ, 3 వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఈనెల 28 లోపు చెల్లించాలని ఎంవిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి బుధవారం తెలిపారు. డిగ్రీలో 2018 నుంచి పీజీలో 2020 నుంచి 2023 వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

December 19, 2024 / 05:50 AM IST

ఈనెల 21న జాబ్ మేళా

E.G: యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 21న కొవ్వూరు ఏబీఎన్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. 34 కంపెనీల ప్రతినిధులు ముఖాముఖీ నిర్వహించి 1,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. పది నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 19, 2024 / 05:13 AM IST

ఈ నెల 21న తల్లిదండ్రుల సమావేశం

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 21న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని, దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

December 19, 2024 / 04:40 AM IST

ఈనెల 26 లోగా దరఖాస్తులు చేసుకోండి

MDK: ఐటీఐలో ఉత్తీర్థులైన అభ్యర్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 26వ తేదీ లోగా https:/// www.iict.res.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 19, 2024 / 04:26 AM IST

అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియంలో చరిత్ర సబ్జెక్టు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ వేణు ప్రసాద్ తెలిపారు. పీజీలో 55% ఉత్తీర్ణత, నెట్, సెట్, పీహెచ్డీ పట్టా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలన్నారు.

December 19, 2024 / 04:11 AM IST

ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి

NLG: ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు.

December 19, 2024 / 04:11 AM IST

బ్రిడ్జ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: ప్రభుత్వ ఐటీఐల్లో 60 శాతం మార్కులతో రెండేళ్ల కాల పరిమితి కోర్సులు ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు బ్రిడ్జి కోర్సు 2025-26 కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపల్ M.చందర్ తెలిపారు. బ్రిడ్జి కోర్సుల ప్రవేశాల కోసం డిసెంబర్ 18 నుంచి 2025 జనవరి 30 వరకు ప్రభుత్వ ఐటీఐ, వరంగల్ నందు దరఖాస్తులు అందజేయాలని కోరారు.

December 19, 2024 / 04:04 AM IST