తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.78,600 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరగటంతో రూ.72,050గా ఉంది. కాగా, వెండిపై ఏకంగా రూ.4000 పెరగ్గా కిలో వెండి ధర రూ.1,04,000కు చేరింది.
VZM: జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను పార్ట్ టైం ప్రాతిపదికన బర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త ఫ్లోరెన్స్ తెలిపారు. నెల్లిమర్ల గురుకుల పాఠశాలలో ఈనెల 12న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఇంగ్లీష్, సివిక్స్, బోటనీ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తామన్నారు.
VZM: మైనార్టీ అభ్యర్థులకు DSCలో ఉచిత శిక్షణకు మంగళవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల కార్యనిర్వాహక సంచాలకుడు RS జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 0866 2970567 నంబరు లేదా కార్యాల యంలో సంప్రదించాలన్నారు.
ప్రకాశం: అద్దంకి సమీపంలోని శింగరకొండలో ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 59 మంది ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మోహనరావు తెలిపారు. మొత్తం 116 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. మేళాలో పలు కంపెనీలకు 59 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ప్రకాశం: ఒంగోలులోని ప్రభుత్వ బాలుల ఐటీఐ కళాశాలలో సోమవారం జరిగిన జాబ్ మేళాకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా, 43 మంది అప్రెంటీస్ శిక్షణకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ అప్రంటీస్ మేళాలో ఐటీఐ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. అప్రంటీస్ షిప్ మేళాను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.
SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ టైం టేబుల్ విడుదల అయింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధికారి పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్( జెకెసి ) ఆధ్వర్యంలో ఈనెల 12న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. టెన్త్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బిటెక్, అర్హతలు కలిగి 30సంవత్సరాలలోపు గల అభ్యర్థులు అర్హులన్నారు.
విజయనగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమో చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈ మేళాలో బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు https:// naipunyam.ap.gov.in వెబ్ సైట్ అప్లై చేసుకోవచ్చు.
నూతనంగా తీసుకువచ్చిన ఏఐ ద్వారా 800 కోట్ల ఫోన్ కాల్స్‌పై వినియోగదారులను హెచ్చరించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. అంతేకాకుండా 80 కోట్లకు పైగా మోసపూరిత సందేశాలను గుర్తించినట్లు తెలిపింది. తద్వారా స్పామ్ కాల్స్‌కు సమాధానం చెప్పే వినియోగదారుల సంఖ్య 12 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది. ఈ స్కామర్లు ఎక్కువగా ల్యాండ్‌లైన్ నుంచే మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించింది.
మదుపర్లకు సెబీ హెచ్చరికలు జారీ చేసింది. అనధికార వైబ్సైట్ల నుంచి అన్‌లిస్టెడ్ షేర్లను ట్రేడింగ్ చేయవద్దని సూచించింది. వీటి ద్వారా ట్రేడింగ్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అందువల్ల అనధికార సైట్లలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే నిధుల సమీకరణకు, షేర్ల ట్రేడింగ్‌కు అనుమతి ఉంటుందని చ...
ఈ ఏడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా 32,08,719 వాహన విక్రయాలు జరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య తెలిపింది. గతేడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.21 శాతం ఎక్కువని పేర్కొంది. పీవీ విభాగంలో వీటి విక్రయాల 3,21,943కి పడిపోయినట్లు వెల్లడించింది. అలాగే రిటైల్ విక్రయాలు మాత్రం పెరిగినట్లు చెప్పింది.
SKLM: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీ రాములు తెలిపారు. INTER , DEGREE,PG పూర్తిచేసి ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9553292734 సంప్రదించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్‌లో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER, డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్‌సైడర్‌ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకుంది. తాజాగా జపాన్‌కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ వాటాల విలువ సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా.
వచ్చే వారం 11 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ప్రముఖ కంపెనీలు విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ సబ్స్క్రిప్షన్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్వేషనల్ జెమోలాజికల్ ఇన్ట్సిట్యూట్, ధనలక్షి క్రాప్ సైన్స్, జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, పర్పుల్ యూనిల్ సేల్స్, సుప్రీమ్ పెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హైవోల్టేజ్ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకర...