జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జూలైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా.. ఆ కంపెనీలు అక్టోబర్‌లోనూ మరోసారి పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ మాత్రం కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. అలాగే, BSNL మరోసారి స్వల్పంగా సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలకు గానూ ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.