KRNL: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీరంజిత్ బాషా వెల్లడించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల ఇ-కామర్స్ సంస్థ మింత్రా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఎం-నౌ’ పేరుతో బెంగళూరులో సేవలను ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మింత్రా CEO నందితా సిన్హా తెలిపారు. ఎం-నౌ సేవల్లో భాగంగా ఆర్డరు పెట్టిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 10వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని, త్వరలో ఒ...
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళ హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా బోటనీ అండ్ మైక్రో బయాలజీ విభాగానికి చెందిన అధ్యాపకురాలు మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఇన్చార్జి వీసీ ఆచార్య గంగాధరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు చీఫ్ వార్డెన్‌గా సునీత, డిప్యూటీ వార్డెన్‌లుగా ఏఎస్వీ రాధిక, వీ. సుభాషిని, టీ. ఝాన్సీలను నియమించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ అర్హులేనన్నారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాలకు 9709165456 సంప్రదించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో ఈ నెల 9న PM అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. 7 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
PLD: తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గోగా అనిల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. నెకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన అనిల్ మహమ్మారి, ప్రజారోగ్య శాస్త్రములో గోల్డ్ మెడల్ సాధించాడు. తమిళనాడు కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన 9వ స్నాతకోత్సవంలో కులపతి పద్మనాభన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌ను అందజేశారు.
SKLM: జిల్లాలో DR. BR. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డా. జి.పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
TPT: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC)లో 10వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ, కోల్ మన్ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. ఇంటర్, డిగ్రీ, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ రేపటి నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 12, 12R, నార్డ్ 4 ఫోన్లపై రాయితీ, బ్యాంకు డిస్కౌంట్లు అందిస్తోంది. 12 నెలల వరకు నోకాస్ట్ EMI సదుపాయం కల్పిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి స్టోర్లలో ఆఫర్లు లభిస్తాయి.
సూపర్ మార్టులను నిర్వహించే విశాల్ మెగామార్ట్ IPOకు రానుంది. ఈ నెల 11న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై 13న ముగియనుంది. ధరల శ్రేణి వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ IPO పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్లను విక్రయించనుంది. కాగా, దేశవ్యాప్తంగా 626 విశాల్ మెగామార్ట్ స్టోర్లు ఉన్నాయి. మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 80,970 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,443 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 84.71 ఉంది.
SKLM: జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జనరల్ ఒకేషనల్ విభాగాల్లో ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు గురువారంతో ముగుస్తుంది. జిల్లావ్యాప్తంగా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 35 వేల మందికి పైగా చదువుతున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రంలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
KNL: APSSDC ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలోని అనంత డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. జీతం రూ.14 వేల నుంచి రూ.20 వేల వరుకు ఉంటుందని, 10వ తరగతి ఆపై చదివిన నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ రికార్డును కొల్లగొట్టింది. తొలిసారి లక్ష డాలర్ల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి బిట్‌కాయిన్ విలువ పెరుగుతూనే ఉంది. క్రిప్టో కరెన్సీల విషయంలో ట్రంప్ సానుకూలంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
CTR: బైరెడ్డిపల్లె మండలంలోని కమ్మనపల్లె గురుకుల పాఠశా లలో భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయ పోస్టు లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం లోపు దరఖాస్తు చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ శోభ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో సంప్రదించాలన్నారు.