ASF: కాగజ్నగర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, చరిత్ర, కంప్యూటర్ సైన్స్, బోటనీ, కామర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హులైన వారు ఈనెల 27న సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.