అల్లూరి: అరకులోయ మండలంకు నాలుగు ఆయా పోస్టులు మంజూరైనట్లు సీడీపీవో కె శారదా తెలిపారు. మండలంలోని పద్మాపురం పంచాయితీ బొండంగూడ, లోతేరు పంచాయితీలో తోటవలస, లండిగుడ, మాదల పంచాయితీ కమలతోట గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల్లో స్ధిర నివాసితులైన వివాహితులు ఈనెల 31లోపు ధరఖాస్తులను ఐసిడిఎస్ ఆఫీసులో అందజేయాలన్నారు. ఈ పోస్టులకు పదవ తరగతి పాసైన వారు అర్హులన్నారు.