WNP: కళాశాల విద్య కమిషన్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు బయోడేటాతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం నియామకాలు జరుగుతాయన్నారు.