W.G: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో నరసాపురంలోని వై.ఎన్ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 70 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులైన వారిని అర్హులుగా పేర్కొన్నారు.