గ్లోబల్ టెక్ జెయింట్ గూగుల్ లేఆఫ్స్ ప్రకటించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన సిబ్బందితో కొంతమందిని తొలగిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై కోతలు ఉంటాయని గూగుల్ సర్వ సభ్య సమావేశంలో పిచాయ్ సూచించినట్లు తెలుస్తోంది.