KKD: ఏలేశ్వరం వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మినీ ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండలరావు, ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులై 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8688977277 నంబర్‌ను సంప్రదించాలన్నారు.