గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ ‘TCS’ కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీ ఉద్యోగాలు ఉంటాయని కంపెనీ చీఫ్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం సుమారు 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.