BDK: జిల్లా కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి బోధనా సిబ్బంది పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధనా సిబ్బంది ఔట్ సోర్సింగ్ పోస్టింగ్ కింద నియామకం ఉంటుందని, అభ్యర్థులను డెమో ద్వారా ఎంపిక చేస్తామన్నారు.