ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 7 చివరి తేదీ. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/web/careers/current-openings ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. APలో 50, తెలంగాణలో 342 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.