కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్‌ఛార్జి వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.