ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి టికెట్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్తోపాటు 10 కిలోల వరకు అదనపు లగేజి తీసుకెళ్లడానికి అవకాశం ఇచ్చింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ ప్రకటనలో వెల్లడించారు.