నెల్లూరు వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితా బుధవారం విడుదల చేస్తున్నట్లు DMHO డాక్టర్ పెంచలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఫార్మాసిస్ట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 19వ తేదీలోపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తెలియచేయాలని కోరారు.