KMM: టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 20 ఉ. 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 210 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్, ఐటీఐ. ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18-30 ఏళ్ళు ఉన్నవారు అర్హులన్నారు.