ఏలూరు జిల్లాలో 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలను సరిచేసుకునేందుకు డిసెంబర్ 19 నుంచి 23 వరకు అవకాశం ఉందని డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సదరు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా అభ్యర్థుల పేరు, ఆధార్ చిరునామా, తదితర తప్పులను సరిచేయాలని సూచించారు.