OnePlus Ace 2 Pro: వన్ ప్లస్ కంపెనీ మిడ్ రేంజ్లో మొబైల్స్ తీస్తూనే.. ప్రీమియం సెగ్మెంట్లో కొత్త మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2 ప్రో (OnePlus Ace 2 Pro) మొబైల్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చైనాలో జూలై లేదంటే ఆగస్టులో ఈ ప్రీమియం మొబైల్ రిలీజ్ కానుంది. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీకి కాపీగా, కాంపిటీషన్‌గా మొబైల్ వస్తోంది.
డిస్ ప్లే రిజల్వేషన్ హై ఉంది. 1.5కే గా ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్వోసీ మీద మొబైల్ రన్ అవుతుంది. మొబైల్ 100 వాట్లా ఫాస్ట్ ఛార్జీంగ్ సపోర్ట్ చేస్తోంది. కొన్ని ఫీచర్లను టిప్ స్టార్ లీక్ చేసింది. చైనా సోషల్ మీడియా వీబోలో సోమవారం తెలిపింది. 6.74 ఇంచుల డిస్ ప్లేతో మొబైల్ వస్తోంది. కర్వ్డ్ ఎడ్జ్‌తో ప్రీమియం లుక్‌లో ఉంది. వన్ ప్లస్‌లో నార్డ్ (Nord) సిరీస్ బడ్జెట్ రేంజ్లో వచ్చిన సంగతి తెలిసిందే. నార్డ్ సీఈ, సీఈ 2 లైట్ 5జీ, సీఈ 3 లైట్ 5జీ మొబైల్స్ రూ.20 వేల లోపు వచ్చాయి. దీంతో మిడ్ రేంజ్లో చూసేవారు బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్స్ కొనుగోలు చేశారు.