Tecno Camon 20, Camon 20 Pro 5G, Camon 20 Premier 5G Launched in India
Tecno Camon 20: చైనాకు చెందిన టెక్నో తన మొబైల్స్ భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. టెక్నో కామన్ 20 సిరీస్ (Tecno Camon 20) పేరుతో మూడు ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో టెక్నో కామన్ 20 మొబైల్ (Tecno Camon 20) ఈ రోజు నుంచి అందుబాటులో ఉంది. టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రోకు లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యుయల్ అప్పియరెన్స్ బ్యాక్ ప్యానెల్ ఇచ్చారు. ఈ మూడు మొబైల్స్ కూడా ప్రీమియం లుక్‌లో కనిపిస్తున్నాయి.
టెక్నో కామన్ 20, (Tecno Camon 20) 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ వేరియంట్లో వస్తోంది. ధర రూ.14,999గా ఉంది. టెక్నో కామన్ 20 ప్రో 16 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ ధర రూ.19,999గా ఉంది. అదే 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ ధర రూ.21,999గా ఉంది. ఈ మొబైల్ 6.67 ఇంచులో అమోలెడ్ ఇన్ డిస్ ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ ఇచ్చారు. కామన్ 20లో 64 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, ఏఐ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ప్రో వేరియంట్లో 64 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ ఉంది. 45 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది.