కస్టమర్లు ఏ వస్తువు కొన్న బిల్కి ఫోన్ నెంబర్ (Mobile Number) తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని వినియోగదరు(customer)ల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేయనుంది. అయితే.. తాము ఫోన్ నెంబర్ ఇవ్వలేమని చెబుతుంటే.. అలా అయితే బిల్ జనరేట్ చేయలేమని స్టోర్లు, షాపింగ్ మాల్స్ (Shopping malls) తదితర రిటైలర్లు చెబుతున్నారని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. వ్యాపారులు(Traders) ఫోన్ నెంబర్ తప్పనిసరి అనడం వినియోగదారుల పరిరక్షణ చట్టం ఉల్లంఘనేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ తెలిపారు.