ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ గురించి తెలియని వారుండరు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని వాడేవారే. ఈ యాప్ లో రీల్స్ చేసి పాపులారిటీ తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల లాభం ఎంత ఉందో… సమస్యలు ఎదుర్కున్నవారు కూడా అంతే ఉన్నారు. ఈ యాప్ లో మెసేజ్ సెక్షన్లో లైంగిక, అసభ్యకరమైన ఫొటోలతో యూజర్లు ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు.. సరికొత్త ఫీచర్‌ను ఇన్స్టాతీసుకొస్తుంది. వినియోగదారులకు ‘సైబ్ఫ్లాషింగ్’ నుంచి మరింత రక్షణ కల్పించే దిశగా ఇన్స్టాగ్రామ్ కృషిచేస్తున్నట్టు నివేదికలు వచ్చాయి.
ఈ మేరకు కొత్త ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ ఫీచర్.. లైంగిక, అసభ్యకరమైన ఫొటోలు యూజర్ల ఇన్‌బాక్స్‌లోకి చేరకుండా ఉపయోగపడుతుందని సమాచారం. ఆన్లైన్లో అసభ్యకర, లైంగికపరమైన ఫొటోలను పంపించి, వేధించడాన్ని సైబర్ ఫ్లాషింగ్ అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య కాలంలో ఇవి చాలా పెరిగిపోయాయి.
అసభ్యకరమెసేజ్ ల వల్ల మహిళలు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటననలు అడ్డుకునేందుకు ఇన్‌బాక్స్‌లోకి వచ్చే మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా ఫిల్టర్ చేసే దిశగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రయత్నిస్తోంది.
ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ ‘మెటా’ డెవలపర్ అలెస్సాండ్రో పౌజి.. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ఛాట్‌లో న్యూడిటీ నుంచి రక్షణ కల్పించే ఫీచర్‌పై ఇన్స్టాగ్రామ్ పనిచేస్తోంది. ఫొటోలను ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేయలేదు. కానీ న్యూడిటీతో కూడిన ఫొటోలను అడ్డుకుంటుంది,’ అని ట్వీట్ చేసారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు తమకు న్యూడ్ ఫొటోలు రాకుండా నియంత్రించుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ మరికొద్ది వారాల్లో అందబాటులోకి వచ్చే అవకాశం ఉంది.