TG: రాష్ట్రంలో MBBS కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్లకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 6 నుంచి ఈ నెల 29 సాయంత్రం వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏమైనా సమస్యలుంటే 9392685856/ 7842136688/ 9059672216 ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా tsmedadm2024@gmail.comకు మెయిల్ చేయవచ్చు.