ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. తన M సిరీస్లో M55s పేరిట విడుదల చేసింది. M55s 8GB+256GB వేరియంట్ రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 12GB+256GB మరో రెండు వేరియంట్లు ఉన్నా.. వాటి ధరలను వెల్లడించలేదు. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్లో లభిస్తుంది. ఈనెల 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు కార్డులతో రూ.2 వేలు డిస్కౌంట్ పొందొచ్చు.