రిలయన్స్ (Reliance) జియో మరో సంచలనానికి తెర తీసింది. జియో(Jio) భారత్ పేరిట 4G ఫోన్ను కేవలం రూ. 999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 7 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ మొబైల్లో రూ. 123 టారిఫ్ ప్లాన్ కూడా ప్రవేశ పెట్టగా.. 28 రోజుల వ్యాలిడిటీతో 14GB డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్, జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ కోసం దీన్ని వాడుకోవచ్చు. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు.దేశంలో ఇప్పటికీ 25 కోట్లమంది 2జీ మొబైల్స్ వాడుతున్నారన్నారు. జియో నెట్ వర్క్(Jio Network)ను తీసుకువచ్చినప్పుడే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో భాగంగా జియో భారత్ ను తీసుకు వచ్చామన్నారు.ఈ మొబైల్ కు నెలకు రూ.123 రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.
28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 0.5 జీబీ డేటాతో 28 రోజుల వ్యవధిలో 14 జీబీ డేటా వస్తుంది. ఇక సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది.ఈ ఫోన్ ను కార్బన్ కంపెనీ తయారు చేసింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ (mah battery) తో వస్తోంది. జియో సిమ్ లాక్ అయి ఉంటుంది. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇందులో జియో పే యాప్ ను అందిస్తున్నారు. దీంతో యూపీఐ పేమెంట్స్(UPI Payments) చేసుకోవచ్చు. టార్చ్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం జాక్, 0.3 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. డివైజ్ స్టోరేజ్ ని ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.