JIO Cinema:రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా (JIO Cinema) యాప్ ప్రియం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేస్తోంది. కొద్దీ రోజుల్లో డివైస్‌కు చార్జీ వసూల్ చేయనుంది. ఇప్పుడు ఐపీఎల్ హవా నడుస్తోన్నందున చాలామంది తీసుకుంటారని కంపెనీ భావించి ఉంటుంది. అంతకుముందు అయితే ఐపీఎల్ సీజన్ మొత్తం ఫ్రీగా ఇస్తామని పేర్కొంది. జియో సినిమాలో కొత్త సినిమాలు (cinema), వెబ్ సిరీస్ (web series), మ్యూజిక్ వీడియోలు (music videos) స్ట్రీమ్ చేయనుంది. .
జియో సినిమా (jio cinema) నుంచి మూడు ప్లాన్లు వస్తున్నాయని తెలిసింది. ఓ స్క్రీన్ షాట్‌ను యూజర్ రెడిట్‌లో పోస్ట్ చేశారు. డైలీ, గోల్డ్, ప్లాటినమ్ పేర్లతో ప్లాన్లు ఉండబోతున్నాయట. డైలీ ప్లాన్ రూ.2కే జియో అందించనుంది. ప్లాన్ ధర రూ.29 కానీ డిస్కౌంట్ ద్వారా రూ.2కే అందిస్తున్నారు. ఒక రోజు రూ.2తో ప్యాక్ కొనుగోలు చేస్తే 24 గంటలు యాప్ కంటెంట్ వీక్షించొద్దు. ఒకేసారి రెండు డివైజుల్లో చూసే వీలు కల్పించింది. అంటే నెలకు 60 రూపాయలు చార్జీ చేస్తారు.
మరో ప్లాన్ గోల్డ్ స్టాండర్ట్ (gold).. దీని ధర రూ.299 కాగా.. రిలయన్స్ రూ.99కే అందిస్తోంది. వ్యాలిడిటీ మాత్రం 3 నెలలు ఇచ్చారు. ఈ ప్లాన్‌లో కూడా రెండు డివైజుల్లో ఒకేసారి కంటెంట్ చూసే వీలు ఉంది. ఇక ప్రీమియం ప్లాన్ ధరను కంపెనీ రూ.1199గా పేర్కొంది. డిస్కౌంట్లో మాత్రం రూ.599కే ఇస్తోంది. ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌లో 4 డివైజ్ వినియోగించుకోవచ్చు. లైట్ కంటెంట్ తప్ప.. మిగిలిన కంటెంట్‌లో యాడ్స్ ఉండవు. ఈ ప్లాన్లను రిలయన్స్ అధికారికంగా ప్రకటించలేదు. యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అందరికీ ఒకే ప్లాన్లు ఉంటాయా..? జియో యూజర్లకు వేరే ప్లాన్ ఏమైనా ఉంటాయా? అనే విషయంపై క్లారిటీ లేదు.