ప్రస్తుతం రోజుల్లో క్రెడిట్ కార్డ్(Credit card)ల వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను చక్కగా నిర్వహించగలుగుతారు. డబ్బు (Money) లేని సమయంలో క్రెడిట్ కార్డ్ అవసరాలు తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.అలాంటి కార్డును పొందడానికి అనేక పత్రాలు అవసరం. క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోరు(Credit score)కు తోడు, మంచి ఆదాయ మార్గం కూడా ఉండాలి. చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంటుంది. కానీ, ఇది గతంలో. ఇప్పుడు ఇవేమీ లేకపోయినా క్రెడిట్ కార్డు సులభంగానే పొందొచ్చు. క్రెడిట్ కార్డుకు ఉద్యోగం(job), ఆదాయ రుజువులు అక్కర్లేదు.ఆదాయ రుజువులు, వేతన ఖాతా లేనప్పుడు.. ఇతర మార్గాల ద్వారా ఆదాయ వనరులు తెలుసుకుని క్రెడిట్ కార్డులను సంస్థలు మంజూరు చేస్తున్నాయి
సంబంధిత వ్యక్తి అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే, వాటిని తిరిగి ఎలా చెల్లించారో చూస్తాయి. సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వివరాలు చూస్తాయి. క్రెడిట్ బ్యూరోలో మంచి స్కోరు చెల్లింపుల చరిత్ర ఉంటే బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి. బ్యాంక్ స్టేట్ మెంట్(Bank statement), ఫామ్ 26 ఏఎస్, జీఎస్ టీ ఆర్ -3బీ (వ్యాపారులు) చూసి కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఈ వివరాలు చూసే ముందు కస్టమర్ల సమ్మతిని బ్యాంకులు తీసుకుంటున్నాయి. కోటక్ మహీంద్రా (Kotak Mahindra) బ్యాంక్ అయితే సంబంధిత కస్టమర్ కు బ్యాంక్ తో ఉన్న అనుబంధం ఏపాటిది? ఖర్చు చేసే తీరు ఎలా ఉంది? యూపీఐ (UPI) చెల్లింపులు, క్రెడిట్ స్కోరు, ఇతర డేటా ఆధారంగా కార్డులు మంజూరు చేస్తోంది. అంటే ఎన్నో మార్గాల ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి కార్డులను ఇస్తున్నాయి.