»Mynampally Hanumantha Rao And Rohit Joined The Congress Party In The Presence Of Kharge
Mynampally hanumantha rao: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Mynampally hanumantha rao and rohit joined the Congress party in the presence of Kharge
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్‌తో కలిసి గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(aicc chief kharge) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే అతని కుమారుడు, తనకు రెండు టిక్కెట్లను ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధృవీకరించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీని హనుమంతరావుకు, మెదక్‌ను రోహిత్‌కు కాంగ్రెస్ కేటాయించినట్లు తెలుస్తోంది. వీరి చేరికతో మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి చేరారు.
తెలంగాణలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోందని మైనంపల్లి హనుమంతరావు(Mynampally hanumantha rao)అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయిస్తోందని గుర్తు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో తమకు స్పష్టమైన మద్దతు ఉందన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా, క్యాడర్, అనుచరులు తమ వెంటే ఉంటారని తెలిపారు. అయితే హనుమంతరావు చేరిక పార్టీ నాయకత్వానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టనున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి టికెట్ ఆశించిన వారిలో నందికంటి శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ శ్రీధర్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మెదక్ నుంచి తన కుమారుడికి టిక్కెట్టు హామీ ఇవ్వకపోవడంతో మైనంపల్లి బీఆర్ఎస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
#WATCH | Delhi: BRS MLA Mynampally Hanumantha Rao along with his son joined the Congress Party in the presence of the Congress president Mallikarjun Kharge and party’s Telangana unit chief Anumula Revanth Reddy.