»How To Earn Lakhs From Twitter A Smart Phone Is Enough
Twitter: ట్విట్టర్ నుంచి లక్షలు సంపాదించండిలా..స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ అయిన ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో ట్విట్టర్ యూజర్లు నగదును సంపాదించుకునే అవకాశాన్ని ఎలాన్ మస్క్ కల్పించారు.
ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక రూల్స్ తీసుకొచ్చాడు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ అయిన ట్విట్టర్(Twitter) తమ యూజర్లను(Users) ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇండియాలోని యూజర్ల కోసం తాజాగా ట్వీట్టర్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చాలా మంది ఇప్పటికే ట్విట్టర్ నుంచి లక్షల సంపాదనను పొందుతున్నారు. అయితే ఇకపై ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించాలనే వారికి కొన్ని షరతులను, నిబంధనలను ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టారు.
ఎలాన్ మస్క్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్స్‌లో అర్హతల గల క్రియేటర్లు ప్రకటనల నుంచి సంపాదించిన వాటిలో వాటాను పొందే అవకాశం ఉంది. ట్విట్టర్ నుంచి సంపాదన పొందాలనుకుంటే 500 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండాలి. గత నెలలో 15 మిలియన్ ఆర్గానిక్ ట్వీట్ ఇంప్రెషన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ నిబంధనలను పూర్తి చేస్తే ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ గురించి యూజర్లు తెలుసుకోవాలి. దేశంలో వెబ్ యూజర్ల నెలవారీ ప్లాన్ రూ.650లు కాగా మొబైల్ యూజర్లు రూ.900 ప్లాన్ తీసుకుంటున్నారు. ట్విట్టర్ సంవత్సర ప్లాన్ కోసం రూ.6,800 కట్టాల్సిందే. ట్విట్టర్ వార్షిక ప్లాన్ తీసుకుంటే నెలవారీ ప్లాన్ కంటే తక్కువగానే నగదు అవుతుంది. కాబట్టి ఈ రకంగా ట్విట్టర్‌ను ఉపయోగించి మీరు కూడా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టండి.