Gold and Silver Rates Today : కాస్త తగ్గి ఊరించిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టాలని చూసే వారికి ఇప్పట్లో వీటి ధరలు దిగి వచ్చే ఛాయలు ఏమీ కనిపించడం లేదు. సోమవారం దేశీయ మార్కట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. రూ.305 పెరిగి రూ.74,355కు చేరుకున్నాయి.
అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,355గానే కొనసాగుతోంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నదని గుర్తుంచుకోవాలి. నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి తోడవుతాయి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) సైతం సోమవారం భారీగా పెరిగింది. ఒక్కరోజే రూ.1190 పెరిగి రూ.93,030కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, , ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి అప్ ట్రెండ్‌లోనే ఉండటం గమనార్హం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో సైతం స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ పదకొండు డాలర్లు పెరిగి 2345 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 30.81 డాలర్లుగా ఉంది.