ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ట్రేడింగ్ చేసిన వారిలో 91 శాతం మంది నష్టపోతున్నారని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. అంటే ప్రతి 10 మందిలో 9 మందికి నష్టాలే వస్తున్నాయని తెలిపింది. తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆశతో ఈ ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని.. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 73 లక్షల మంది నష్టాలు చవిచూసినట్లు తెలిపింది. వీరు సగటున రూ.1.2 లక్షల చొప్పున నష్టపోయినట్లు వెల్లడించింది.