»Doctors Using Chatgpt In Healthcare Medical Diagnosis Research Artificial Intelligence
ChatGPT: ఓరి దేవుడా! ఇప్పుడు వైద్యులు కూడా చాట్‌జిపిటిని ఉపయోగిస్తున్నారు
రోగులకు లేదా వారి కుటుంబాలకు రోజూ చెడు సమాచారం ఇవ్వడం వైద్యులకు అంత సులభం కాదు. అయితే, ChatGPT వంటి AI చాట్బాట్లు ఈ విషయంలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం
ChatGPT: ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత Chatbot ChatGPT క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు వైద్యులు కూడా వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం.. AI ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా స్థానం సంపాదించింది. ఆసుపత్రిలో వైద్యులు ప్రజలకు ఎన్నిసార్లు చేదువార్తలు చెబుతారో తెలియదు. చేదు వార్తలను అందించాల్సి వచ్చినప్పుడు బాధిత కుటుంబీకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో తెలియదు.. చాలా సార్లు డాక్టర్లదే తప్పని దాడులు చేసిన ఘటనలు లేకపోలేదు. అందుకే రోగులకు ఇబ్బంది కలిగించే వార్తలను అందించడానికి ChatGPT వంటి AI చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులతో నిరంతరం డాక్టర్లు జీవిస్తుంటారు. చికిత్స సమయంలో రోగి మరణించడం వంటి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించడం చాలా బాధాకరమైన పని. అందుకే కొన్నిసార్లు డాక్టర్లను చాలా స్ట్రిక్ట్ వ్యక్తులుగా పరిగణిస్తారు. అయితే, ఇప్పుడు ఏఐ చాట్‌బాట్ ద్వారా విషాదకరమైన వార్తలను అందించే పని జరుగుతోంది.
ChatGPTతో మెరుగైన కనెక్షన్ ఏర్పడుతోంది
న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, రోగులకు చెడు వార్తలను సులభంగా అందించడానికి AI చాట్బాట్లు ఉపయోగించబడుతున్నాయి. OpenAI గత సంవత్సరం ChatGPTని ప్రారంభించింది.. దాని తర్వాత దాని ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు చాట్‌జిపిటి వైద్యులు, రోగుల మధ్య మెరుగైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఒక గొప్ప మార్గంగా మారింది.
ChatGPTకి మెరుగైన స్పందన
ఇటీవల, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ChatGPT, వైద్యులపై ఒక అధ్యయనం చేశారు. దీని ప్రకారం 585 కేసులలో 78.6 శాతం వైద్య నిపుణులు డాక్టర్ కంటే ChatGPT ప్రతిస్పందనను మెరుగ్గా పరిగణించారు. అంటే చాట్‌జిపిటి రోగులకు వైద్యుల కంటే మెరుగైన రీతిలో స్పందించగలదు.