»Congress Leader Chidambaram Comments On Electoral Bonds With Bjp
Electoral bonds:పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్ల విక్రయం గురించి మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం(Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని "చట్టబద్ధమైన లంచం"గా అభివర్ణించారు. తాజాగా అక్టోబర్ 4న మళ్లీ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది బీజేపీకి "బంగారు పంట" అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
congress leader Chidambaram comments on electoral bonds with bjp
దేశంలో ఎలక్టోరల్ బాండ్ల(electoral bonds) విక్రయం బీజేపీకి బంగారు పంట లాంటిదని మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం(Chidambaram) అన్నారు. అంతేకాదు వీటిని చట్టబద్ధమైన లంచంగా పేర్కొన్నారు. వీటి వల్ల బీజేపీ మాత్రమే లాభమని తెలిపారు. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న క్రమంలో మళ్లీ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేకాదు గత రికార్డులు చూసినా కూడా అనామక విరాళాలలో 90 శాతం బీజేపీకే వెళ్తున్నాయని తెలిపారు.
28వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి ప్రభుత్వం శుక్రవారం (సెప్టెంబర్ 29) ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ అక్టోబర్ 4 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల(elections) తేదీలను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
రాజకీయ నిధులకు పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్లను రూపొందించారు. మొదటి బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి అధికారం కలిగి ఉంది. ఎలక్టోరల్ బాండ్లను భారత పౌరులు లేదా దేశంలో స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు.