»Broadcom Acquired Vmware In A Deal Worth Rs 5 7 Lakh Crore
VMwareను దక్కించుకున్న Broadcom..డీల్ విలువ ఎంతంటే?
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్‌వేర్ కంపెనీ బ్రాడ్‌కామ్.. డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
Broadcom acquired VMware in a deal worth Rs 5.7 lakh crore
అగ్రరాజ్యం అమెరికా సెమీకండక్టర్ల తయారీ కంపెనీ బ్రాడ్‌కామ్(Broadcom)..క్లౌండ్ కంప్యూటింగ్ సంస్థ VMwareను కొనుగోలు చేసింది. ఈ మేరకు 69 బిలియన్ల డాలర్ల(రూ.5.7 లక్షల కోట్లు)తో డీల్ ఖరారు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇది టెక్ రంగంలో అతిపెద్ద డీల్ అని చెప్పవచ్చు. ఈ చిప్ తయారీదారు సంస్థ డీల్ కు చైనా నుంచి ఆమోదంతో సహా అన్ని నియంత్రణ ఆమోదాలు పొందినట్లు ధృవీకరించారు.
We are excited to announce the completion of Broadcom’s acquisition of @VMware, marking another important step forward in our efforts to build the world’s leading infrastructure technology company.
అయితే ఇటివల అమెరికా అధ్యక్షుడు బైడెన్(biden) చైనాలో పర్యటించిన తర్వాత ఈ విజయవంతమైన వ్యూహాత్మక ఒప్పందాన్ని ముగించడానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. US-ఆధారిత బ్రాడ్‌కామ్ ఒప్పందం సాఫ్ట్వేర్ పరిశ్రమలో సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనా-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా రెగ్యులేటర్లు ఈ ఒప్పందాన్ని రద్దు చేయవచ్చని గత నెలలో వచ్చిన నివేదికల వచ్చాయి. కానీ బైడెన్ చర్చల నేపథ్యంలో అవన్ని తొలిగిపోయాయని చెబుతున్నారు. మరోవైపు ఈ కంపెనీల విలీనానికి బ్రెజిల్, కెనడా, ఐరోపా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, సౌతాఫ్రికా, తైవాన్, యూకే, ఆస్ట్రేలియా కూడా అనుమతులు ఇచ్చింది.
అంతేకాదు బ్రాడ్ కాంకు చైనా, హువావే టెక్నాలజీస్ తో మంచి సంభందాలు ఉన్నాయి. మొదట సింగపూర్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ తర్వాత అమెరికాకు ప్రధాన కార్యాలయాన్ని మార్చింది. అయితే ఈ కంపెనీ 2017లో క్వాల్ కమ్ ను 117 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకోగా..అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దానిని తిరస్కరించారు. ఈ డీల్ ద్వారా చైనా లబ్దిపొందాలని చూస్తుందని పేర్కొన్నారు. దాని ద్వారా 5జీ టెక్నాలజీలో చైనా అమెరికా(america)ను బీట్ చేస్తుందని భావించారు.