ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ NTA హిస్టరీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, కామర్స్ & హిందీ సబ్జెక్టులకు సవరించిన కీలను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన ఫలితాలపై విద్యార్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు & కోర్టులో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిస్టరీ సబ్జెక్టులో 4 ప్రశ్నలను, కామర్స్ పరీక్షలో 3 ప్రశ్నలను NTA తొలగించింది.