సెప్టెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్(MF)లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 5 కోట్లకు చేరింది. ఈ మార్కెట్లో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గడిచిన 10 నెలల్లోనే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు MF విభాగంలో పెట్టుబడులను పెట్టారని తెలిపాయి. గతంలో కోటి మంది పెట్టుబడిదారులు రావడానికి 21 నెలలు పట్టగా, 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరేందుకు 26 నెలల సమయం మాత్రమే పట్టిందని పేర్కొన్నాయి.