TG: రాష్ట్రంలో ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా కోర్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 10 వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది.